8 June, 2026 | 7:59 PM

Breaking News

ఈదురు గాలులతో విరిగిన విద్యుత్ స్తంభాలు   •   మహర్రం సందర్భంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి   •   పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •  

ఘనంగా గోపూజ, అన్నదానం

08-06-2026 06:21 PM

 మేళ్లచెరువు,(విజయక్రాంతి): మేళ్లచెరువులోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో సోమవారం సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు, గోపూజ, అన్నప్రసాద వితరణ, కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన తదితర కార్యక్రమాలు ఆలయ పూజారులు ఘనంగా జరిపారు. గోపూజ కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ మాజీ చైర్మన్ పెండ్లి లచ్చయ్య, ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎన్.శంబిరెడ్డి, పాలకవర్గ సభ్యులు,అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.