1 August, 2026 | 5:51 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలకు సిద్ధం కావాలి: నారాటి ప్రసాద్

08-06-2026 06:17 PM

మణుగూరు,(విజయక్రాంతి): కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాల రాస్తోందని, దీనిని కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో రాయల బిక్షం అధ్యక్ష తన నిర్వహించిన ఏఐటీయూసీ మండల జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను బలహీనపరి చే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టా లలో మార్పులు తీసుకువస్తోందని ఆరోపించారు.

సంఘటిత, అసంఘటిత కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోం దని విమర్శించారు. అలాగే కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తూ సాధారణ, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని పేర్కొన్నారు. కార్మికులు తమ హక్కుల సాధన కోసం సంఘటితం గా ఉద్యమించాలని, కార్మిక సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు సరెడ్డి పుల్లారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టు కోలేదని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని అన్నారు. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులకు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, ఏఐటీయూసీ జిల్లా ఉపా ధ్యక్షులు ఆర్. లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, సీపీఐ  పట్టణ, మండల కార్యదర్శులు  దుర్గ్యాల సుధాకర్, జక్కుల రాజబాబు, మాజీ ఎంపీపీ ఎడారి రమేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.