5 May, 2026 | 4:03 AM

విశ్వంభరలో అవనిగా..

05-05-2026 02:50 AM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో- ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శక త్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్ర మ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం లో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. హీరోయిన్ ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ముఖ్యపాత్రల్లో పోషిస్తున్నారు. హీరోయిన్ మౌని రాయ్ ఒక ప్రత్యేక గీతంతో అలరించ నుంది. అయితే, త్రిష ఇందులో ‘అవని’ పాత్ర లో కనిపించనుంది.

సోమవారం త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న ‘విశ్వం భర’, ‘కరుప్పు’ టీమ్స్ కొత్త పోస్టర్లు విడుదల చేశాయి. విశ్వంభర చిత్రబృందం పంచుకున్న పోస్టర్‌లో త్రిష.. సాంప్రదాయ దుస్తుల్లో, వెలుగుతున్న దీపాల పళ్లెం పట్టుకుని మెరిసిపోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రానున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: చోటా కే నాయుడు; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్.