16 March, 2026 | 4:56 PM

జిల్లా సంక్షేమ అధికారిని మర్యాద పూర్వకంగా కలిసిన దివ్యాంగులు

16-03-2026 04:12 PM

నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సంక్షేమ అధికారిగా గాజుల వినూత్న ఇటీవల నియామకమయ్యారు. ఈ సందర్భంగా స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం తరుపున సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలు తెలుపుకున్నారు. ఈ నేపథ్యంలో మేడం సహానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారం అయ్యేవిధంగా చూస్తామని హామీయిచ్చారు. ఇందులో సీనియర్ అసిస్టెంట్ రవి కాంత్, జిల్లా అధ్యక్షులు ఇసాక్ అలీ, సత్యనారాయణ, రాజన్న, ఇసాక్ అహ్మద్ తదితరులు ఉన్నారు.