16 March, 2026 | 6:40 PM

బెల్టు షాపులను మూసివేయాలి

16-03-2026 04:10 PM

వెల్లుట్ల గ్రామస్తుల వినతిపత్రం అందజేత

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని వేల్లుట్ల గ్రామంలో బెల్టుషాపులపై మూసివేయాలని సోమవారం వేల్లుట్ల గ్రామ ప్రజలు ఎక్సైజ్ సిఐ షకీర్ అహ్మద్ వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో బెల్ట్ షాపుల విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేయటం వల్ల నిత్యం గొడవలు అవుతున్నాయిని యువత పెడదారి పడుతున్నారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకొవలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్లుట్ల గ్రామస్థులు లింగపురం సాయిలు, జక్కుల సంతోష్ కుమార్, పోతుగంటి సాయిలు,కన్నెబొయిన రాజు, బెగారి రవి, కృష్ణ, గౌతమ్,రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.