13 March, 2026 | 4:18 AM

డయాబెటిస్, బీపీతో కిడ్నీ లకు ముప్పు

13-03-2026 12:00 AM

జాగ్రత్తలు అవసరం: ‘కేర్’ వైద్యులు

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్ వైద్యులు ముందస్తు పరీక్షలు, అవగాహన, జీవనశైలిలో మార్పులు అత్యం త అవసరమని సూచించారు. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్- నెఫ్రాలజీ డాక్టర్ పి. విక్రాంత్‌రెడ్డి, డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్, నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ రతన్ ఝా మాట్లాడుతూ.. కిడ్నీ వ్యా ధి ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలా మంది దానిని పట్టించుకోరు.

మధుమేహం, అధిక రక్తపో టు వంటి సమస్యలు ఉన్నవారిలో కిడ్నీలు సంవత్సరాల పాటు నెమ్మదిగా దెబ్బతింటా యి. అందువల్ల అలాంటి వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం’ అని  తెలిపారు. కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతిని కిడ్నీ వైఫల్యం దశకు చేరే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో రోగులు డయాలిసిస్ లేదా కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

చికిత్స లేకుండా వదిలేస్తే శరీరంలో ద్రవాలు నిల్వ కావడం, రక్తహీనత, ఎముకల సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఉన్నవారు, కుటుంబంలో కిడ్నీ వ్యాధి చరిత్ర ఉన్నవారు, 40 సంవత్సరాల పైబడినవారు, తరచుగా నొప్పి మందులు లేదా కొన్ని ఔషధాలు తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.