9 May, 2026 | 4:48 PM

Breaking News

సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •   దూరదర్శన్ భవన్‌లో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు   •   టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సస్పెన్స్.. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ   •   కొత్తగూడెంలో ఘనంగా కంట మహేశ్వరుని కళ్యాణ మహోత్సవం   •   పల్లకి సేవలో వట్టెం వెంకన్న   •   భీమిరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి   •   మొక్కజొన్న రైతుల ఉసురు తగలదా   •   మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సిసి) అవగాహన సదస్సు..   •   స్వాములకు ఉచితంగా అన్న ప్రసాదం   •  

రాష్ట్ర రహదారిపై మృతదేహంతో ధర్నా

26-02-2026 01:05 AM

న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యుల ఆందోళన 

ధర్మపురి, ఫిబ్రవరి25 (విజయక్రాంతి): వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ పై మట్టి తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఆవునూరి రమేష్(34)డ్రైవర్ మృతి చెందారు. కొత్తపల్లె గ్రామానికి రమేష్ డ్రైవర్ మృతికి ట్రాక్టర్ యజమాని న్యాయం చేయాలంటూ డి మాండ్ చేశారు.ట్రాక్టర్ యజమాని న్యాయం చేయకపోవడంతో రమేష్ బంధువుల ఆందోళన రాష్ట్ర రహదారిపై ఆందోళన చేపట్టారు.

మృతదేహంతో స్తంభంపల్లి కొత్తపల్లే గ్రామాల మధ్య కరీ ంనగర్ మంచిర్యాల రహదారిపై బంధువుల రాస్తారోకో నిర్వహించారు. దీనితో రహదారిపై కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలియడంతో ఎస్త్స్ర ఉదయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామనీ హామీ ఇచ్చారు.దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.కాగా మృతుడు రమేష్ కు భార్య, కొడుకు ఉన్నారు.

మృతికి కారణం ట్రాక్టర్ ఓనర్ నిర్లక్ష్యమేనా?

రమేష్ మృతికి ట్రాక్టర్ యజమాని కారణమైనట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ బోర్లా పడ్డ విషయం తమ వద్ద ఉద్దేశ్యపూర్వకంగానే దాచి పెట్టి రమేష్ మృతికి ట్రాక్టర్ యజమానే కారణం అయ్యినట్లు కుటుంబసభ్యులు బలమైన ఆరోపణలు వ్యక్తపరుస్తున్నారు. ఎలాగైనా మాకు న్యాయం జరిగేలా చూడాలంటూ పోలీస్ అధికారులను వేడుకున్నారు.

ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు

రమేష్ మృతి పట్ల తల్లి ఆవునూరి శంకరమ్మ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్త్స్ర ఉదయ్ కుమార్ పేర్కొన్నారు.