27 February, 2026 | 6:07 AM

మంత్రి తుమ్మలకు దమ్మపేట నాయకుల సంఘీభావం

27-02-2026 12:48 AM

అశ్వారావుపేట, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేసిన దుష్ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్ర పామాయిల్ రైతు సంఘం సంక్షేమ అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పామాయిల్ మొక్కలపై మంత్రి తుమ్మలపై ఆరోపణ చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ గత 15 సంవత్సరాలగా ఏమి జరిగిందో వివరించారు.

ఈరోజు తన శాఖ పరంగా మంత్రి తుమ్మల గుర్తింపు తెచ్చుకుంటూ పామాయిల్ సాగు విస్తీర్ణం పై దృష్టి పెడుతూ ఉన్న మంత్రిపై అవాకులు చవాకలు పేలుతున్నారని ఆయన ఆరోపించారు. సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న పామాయిల్ రైతులని అడిగితే ఈ పామాయిల్ సాగుపై మంత్రి తుమ్మల కి ఉన్న ప్రత్యేక శ్రద్ధను ఏ రైతైన గంటా పదంగా చెబుతారని ఆలపాటి  వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆలపాటి ప్రసాద్ తో పాటు సీనియర్ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, అచ్యుతరావు,కాసాని నాగప్రసాద్, ఎర్ర వసంతరావు లతో పాటు పామ్ ఆయిల్ రైతులు పాల్గొన్నారు.