calender_icon.png 19 February, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్మ యాత్ర

19-02-2026 01:39:19 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తు న్న చారిత్రాత్మక 3వ దమ్మ పాదయాత్ర బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. వందలాది థాయ్, భారతీయ బౌద్ధ భిక్షువులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగు ల విగ్రహం వద్దకు బృందం  మధ్యాహ్నం చేరుకుంది. భిక్షువులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం వారు హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహాన్ని దర్శించుకున్నారు.

ముందుగా సికింద్రాబాద్‌లోని వైఎంసీకి వచ్చి సర్వమత ప్రార్థనలు చేశారు. గగన్ మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు గగన్ మాలిక్ యాత్రకు సహాయ సహకారాలు అం దిస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బౌద్ధ భిక్షువుల బృందానికి స్వాగ తం పలికారు. యాత్ర తిరిగి 20న  ప్రా రంభమవుతుంది. ఉప్పల్, ఇబ్రహీంపట్నం, మాల్, చింతపల్లి మీదుగా పాదయా త్ర కొనసాగుతుంది. మార్చి 1న నాగార్జునసాగర్లోని బుద్ధ వనం వద్ద ముగుస్తుంది. ప్రపంచ శాం తిని పెంపొందించేందుకు ఈ ఆధ్యాత్మిక ఘట్టం తోడ్పడుతుందని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు.