పోలేపల్లిలో భక్తి పారవశ్యం
వైభవంగా సాగిన యజ్ఞం, ఇరుముడి కార్యక్రమాలు
ఆమనగల్లు, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో నిర్వహించిన యజ్ఞం మరియు అంజనేయస్వాముల ఇరుముడి మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనుషుల మధ్య ఐక్యతను పెంచుతాయని, ధర్మ మార్గంలో పయనించేలా ప్రేరేపిస్తాయని అన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి నాగులు, కుమార్, బీఆర్ ఎస్ నాయకులు శ్రీరామ్, సత్యం, వెంకటేష్గౌడ్ లు పాల్గొన్నారు.




