రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయాలి
- రైతుల నుంచి 10 లక్షల దరఖాస్తులు స్వీకరణతో అసెంబ్లీకి
- బీజేఎల్పీ డిప్యూటీ లీడర్ పాయల్ శంకర్
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): రాష్ట్రం లో వెంటనే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని బీజేఎల్పీ డిప్యూటీ లీడర్ పాయ ల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్‌లో ఈ పథకానికి సరిపడా నిధులు కేటాయించాలని కోరారు. ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు అదిలాబాద్ కేంద్రం గా రైతులతో కలిసి ఉద్యమ కార్యక్ర మాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఈ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి పంటల బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నామన్నారు. ఈ నెల 16న రైతుల తరఫున సేకరించిన 10 లక్షల దరఖాస్తులతో శాసనసభ సమావేశానికి హాజరై, రైతుల గళాన్ని ప్ర భుత్వానికి గట్టిగా వినిపిస్తామన్నారు. ప్రతి ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీ, ముఖ్యనేతలు రైతుల పక్షాన నిలబడి, ఉద్యమకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు.




