24 August, 2026 | 9:12 PM

శివాలయాల్లో భక్తుల పూజలు

24-08-2026 05:59 PM

బైంసా (విజయక్రాంతి): శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని ముధోల్ నియోజకవర్గం లోని ఆయా ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. కుంటాల మండలంలోని ఓలా సూర్యపూర్ శివాలయంతో పాటు, చీరాల ముధోల్ తదితర ఆలయాలు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఆలయాలను దేవరకోట మాజీ చైర్మన్ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు  శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ సందర్శించి పూజలు నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో పూజారులు ధర్మకర్తలు పాల్గొన్నారు.