కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
- రైతులకు పెట్టుబడి సహాయం, మద్దతు ధరతో పంటల కొనుగోళ్లు చేస్తున్నాం
- మంచిర్యాలలో ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్
మంచిర్యాల, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి బాటలో పయనిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ అన్నారు. మంగళవా రం మంచిర్యాల కలెక్టరేట్ ఆవరణలో ఏర్పా టు చేసిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఎగురవేసి మాట్లా డారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వం లో తెలంగాణ రైజింగ్‌ెే-2047 విజన్‌తో అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాల ప్రగతిని ఆయన వివరించారు. జిల్లాలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక విజయవంతంగా సాగుతోందని, మహాలక్ష్మి పథకం ద్వారా 3.34 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయా ణ సౌకర్యం పొందగా, గృహజ్యోతి కింద 1.33 లక్షల మందికి ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరిందన్నారు.
జిల్లాలో రూ. 537.32 కోట్ల రైతు రుణమాఫీ పూర్తయిందని, వానాకాలం, యాసంగి పంటలకు రైతులకు పెట్టుబడి సహాయం అందించడంతో పాటు మద్ద తు ధరకు ధాన్యం కొనుగోలు చేపట్టామన్నారు. రూ.300 కోట్లతో సూపర్ స్పెషా లిటీ ఆసుపత్రి, రూ.213 కోట్లతో గుడిపేట వైద్య కళాశాల పనులు ముగింపు దశకు వ చ్చాయని, రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథ కం, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భో జన పథకం ప్రారంభం కానుందన్నారు.
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లకు శంకుస్థాపన చేశా మన్నారు. 255.59 కోట్లతో గోదావరి కరకట్ట పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వేడుకల్లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.






