తణుకు స్వప్న మృతికి వేధింపులే కారణం
ఇలా అయితే మిల్లు లు నడప లేము.. మీరే నడపండి...
ప్రభుత్వం దిగి రాకుంటే యసంగి పంట కొనం..
రైస్ మిల్లర్ల హెచ్చరిక
కరీంనగర్, మార్చి9(విజయక్రాంతి): బకాయిల వేధింపులేతణుకు స్వప్న ఆత్మహత్య కు కారణమని. ఇలా అయితే మేము మిల్లు లు నడప లేమని..మీరే నడపందని.. దిగి రా కుంటే యసంగి పంట కొనమని..రైస్ మిల్లర్ల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కారుదర్శులు బోయినపల్లి నర్సింగా రావు, తొడు పునూరి కరుణాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న మమేని సుధాకర్ రావు లు ప్రభుత్వా న్ని హెచ్చరించారుమ్..రైస్మిల్లర్లు నష్టాల్లో ఉ న్నారని తెలిసి కూడ వేధించవద్దని ప్రభుత్వాన్ని వేసుకున్నా బేధింపులు ఆగడం లే దని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. . ఇప్పటికే విధించిన 25 శాతం జరిమానాతో పాటు 12 శాతం వడ్డీని విధిం చి వేధించడం సరికాదని సూచించారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగ ట్టుకు చెందిన బాలాజీ రైస్మిల్లు యజమాని తణుకు సురేశ్ భార్య స్వప్న ఈ నెల 6న ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకొన జిల్లాలోని రా రైస్, బాయిల్ రైస్ మి ల్లర్స్ అసోసియేషన్స్ నాయకులు పెద్ద సం ఖ్యలో తరలి వచ్చారు. తీవ్ర దిగ్బ్రాంతి, సం తాపం వ్యక్తం చేసి సోమావరం కలెక్టర్, అదనపు కలెక్టర్ లను కలసి వినతి పత్రం స మర్పిబిచారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైస్ మి ల్లర్లకు ఎంతో నష్టం కలుగుతున్నదని ఆవేదన చెందారు.
రైస్మిల్లర్లను దొంగల్లా చూడ వద్దవద్దని, ప్రస్తుతం మిల్లర్ల పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. సీఎం, సివిల్ సైప్లెస్ శాఖ మంత్రి, కమిషనర్కు చేతులు జో డించి విజ్ఞప్తి చేస్తున్నామని, రాష్ట్ర రైస్ మిల్లు ఇండస్ట్రీలోనే మొదటిసారి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందన్నారు. తణుకు సురేశ్కు దిగుమతి అయిన ధాన్యం తడిసి భారీగా నష్టాలు రావడం వల్లనే డిఫాల్ట్ అయ్యాడని తెలిపా రు. దీంతో సివిల్ సైప్లె అధికారులు ఎక్కడ కేసులు పెడతారో అనే భయంతోనే ఆయన సతీమణి ఆత్మహత్య చేసుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారి నష్టాల్లో ఉన్నాడని తెలిసీ అధికారులు వేధించడం సరికాదన్నా రు. వెంటనే జరిమానా, వడ్డీని తొలగించి మి ల్లర్ల కుటుంబాలను ఆత్మహత్యల నుంచి కాపాడాలని కోరారు.
రైస్ మిల్లర్లు ఎవరూ అధైర్యపడి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, అసోసియేషన్ నాయకులం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. చాలా మిల్లులు న ష్టాల బాటలోనే కొనసాగుతున్నాయని దీనికి అనేక కారణాలు ఉన్నాయని అందులో అధిక విద్యుత్ చార్జీలు, ధాన్యం ఇచ్చినంత త్వరగా బియ్యం తీసుకోకపోవడం, దాన్యం తరుగు అవడం, డ్యామేజ్ అవ్వడం, ధాన్యంలో నాణ్యత లేక అధిక నూకలు అవడం ఇలా అనేక కారణాల చేత రెస్మిల్ ఇండస్ట్రీ నష్టాల బాటలో నడుస్తున్నదన్నారు. కొంతమంది మిల్లర్ల అశ్రద్ధ అవగాహన లేకపోవడం మూలంగా నష్టాల పాలై డిఫాల్ట్ మిల్లర్లుగా మిగిలిపోతున్నారన్నారు ప్రభుత్వంలో భాగమై ప్రభుత్వ నియమ నిబం ధనలు పాటిస్తూ ఉన్న ఇండస్ట్రీ ఈరోజు నష్టాల ఊబిలో చిక్కుకుందని, అంతేకాకుండా ఇప్పటివరకు మిల్లర్లకు ప్రభుత్వం నుంచి రావలసిన మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్, డ్రై పేజీ మరియు కస్టూడియన్ చార్జీలు గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయినాయని వివరించారు.
డిఫాల్ట్ మిల్లర్లకు విధించిన 25% పెనాల్టీని మరియు 12% వడ్డీని మాఫీ చేపించి ప్రభుత్వానికి బాకీ ఉన్నటువంటి బియ్యం నాలుగు వాయిదాలలో ఇచ్చి బాకీ తీర్చుటకు అనుమతి ఇప్పించి కోరారు. రాష్ట్రంలోని రైస్ మిల్ వ్యవస్థను కాపాడుటకు ప్రభుత్వానికి కిందిస్థాయిలో జరుగుతున్న నష్టాలను వివరించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న రైస్ ఇండస్ట్రీని కాపాడవలసిందిగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు.




