10 March, 2026 | 12:40 PM

అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం

10-03-2026 01:33 AM

మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత

జడ్చర్ల, మార్చి 9: అంతరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత అన్నారు. 99 రోజుల పరిశుభ్రత కార్యక్రమానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ పరిశుభ్రత, తడి-పొడి చెత్త వేరు చే యడం  ప్రభుత్వ సేవలను ప్రజలు ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై  ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ-వేస్ట్ సేకరణ పర్యావరణానికి హాని కలిగించే ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాము. ఇళ్లు, వ్యాపార సంస్థల నుండి పాడైపోయిన మొబైల్స్, ల్యాప్టాప్లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడమైనదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు చైతన్య చౌహన్, కుమ్మరి రాజు, ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది మహిళా సంఘాలు, పట్టణ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.