ప్రకృతి వనాన్ని సందర్శించిన కలెక్టర్
10-03-2026 01:33 AM
భిక్కనూర్, మార్చి 9 (విజయ క్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ భిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామంలోని ప్రకృతి వనాన్ని సోమవారం సందర్శించారు. వనం నిర్వహణ, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డి, ఎంపీడీఓ, డీఎల్పీఓ, ఎమ్మార్‌ఓ, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ భార్గవి పాల్గొన్నారు. అధికారులు వనం అభివృద్ధిపై వివరాలు కలెక్టర్కు తెలిపారు.




