6 May, 2026 | 11:35 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

దోపిడీ చేసినందుకు ఓటు వేయాలా?

09-02-2026 01:17 AM
  1. కాంగ్రెస్‌తోనే పట్టణాల అభివృద్ధి
  2. వైరా, మధిర మున్సిపాలిటీల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రచారం

ఖమ్మంటౌన్/ఎర్రుపాలెం, జనవరి 8 (విజయక్రాంతి): ‘పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు వారికి ఓటు వేయా లా? మనందరినీ తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచినందుకు వారికి ఓటు వేయాలా’ అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. వైరా మున్సిపల్ ఎన్నికల సం దర్భంగా ఆదివారం వైరా, మధిరలో కాంగ్రె స్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచారం లో ఆయన మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వారికి ఎందుకు ఓటు వే యాలని ప్రజలంతా ప్రశ్నించాలని అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ ఇవ్వలేదని ఆగ్ర హం వ్య క్తం చేశారు. తిరిగి ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందన్నారు. వైరా వాసిగా, డిప్యూటీ సీఎం గా ప ట్టణ అభివృద్ధి బాధిత తీసుకుంటా ఈ ఎన్నికలు వైరా పట్టణ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

మధిర పట్టణ అభివృద్ధికి పు నాదులు వేసుకుందాం అన్నారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతూ రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ, మా జీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూవ్వాళ్ల దుర్గాప్రసాద్, బొర్రా రాజశేఖర్, సూతకని జైపాల్, కట్ల రంగారావు, శీలం నర్సిరెడ్డి పాల్గొన్నారు.