2 July, 2026 | 1:17 AM

అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజలే మా బలం

02-07-2026 12:09 AM

ప్రగతికి కొత్త అడుగు అభివృద్ధి తోనే సాధ్యం 

రూ. 40 కోట్లతో పర్దిపూర్ ముచ్చింతల హైలెవెల్ బ్రిడ్జి

విలేకరుల సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యేజి మధుసూదన్ రెడ్డి 

చిన్న చింతకుంట, జూలై 1: అభివృద్ధి మా లక్ష్యంగా పెట్టుకొని ప్రజలే మేము చేస్తున్న పనికి ధైర్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ధమాగ్నపుర్ గ్రామంలో వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పర్ది పూర్ నుంచి ముచ్చింతల్ మధ్యలోని ఒక చెట్టు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం రూ 40 కోట్లు మంజూరు  చేయడం జరిగిందని స్పష్టం చేశారు. కురుమూర్తి క్షేత్రంలో ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ 110 కోట్లతో వేగంగా పనులతో పాటు రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి బ్యాక్ సైడ్ రోడ్డు పనులను పూర్తి చేస్తామని, రూ. 75 లక్షలతో ప్రత్యేక షెడ్ నిర్మాణంతో పాటు కాటేజీల నిర్మాణం కోసం మరో రూ. 80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.

అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రూ. 200 కోట్ల తో పనులు జరగడంతో పాటు వడ్డేమాన్ చౌరస్తా నుండి స్కూల్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రూ. 14 కోట్లు మంజూరయ్యాయన్నారు. 2,500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా అంతర్జాతీయ స్థాయి పాఠశాల పనులను రాబోయే విద్యాసంవత్సరం నాటికి పూర్తి చేస్తామన్నారు. 

పాలమూరు ఐటీఐ కాలేజీని రూ. 46 కోట్లతో అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ గా మార్చడం జరుగుతుందని, ఈ వారంలోనే పనులు ప్రారంభం కానున్నాయన్నారు.  బ్రహ్మోస్ క్షిపణి కేంద్రంప్రసిద్ధ ’బ్రహ్మోస్’ రెండవ యూనిట్ క్షిపణి తయారీ కేంద్రం ఏర్పాటు కానుందని, 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి  సానుకూలంగా అంగీకరించారన్నారు.

30 పడకల ఆసుపత్రులుగా పీహెచ్సీలు చిన్నచింతకుంట, పేరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల కమ్యూనిటీ ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేయడానికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్, కురుమూర్తి దేవస్థానం చైర్మన్ బాలరాజ్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,  తదితరులు పాల్గొన్నారు.