14 July, 2026 | 4:30 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

తహసీల్దార్లుగా 70 మంది డీటీలు

19-03-2026 01:54 AM
  1. ఫలించిన టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ కృషి
  2. మంత్రి పొంగులేటికి, సీసీఎల్‌ఏకు 
  3. నాయకులు కృతజ్ఞతలు

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్(టీజీఆర్‌ఎస్‌ఏ) కృషి ఫలితంగానే 70 డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి లభించిందని ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రాములు, రమేష్ పాక, బాణాల రాంరెడ్డి, వి భిక్షం పేర్కొన్నారు. మల్టీ జోన్-1లో 43, మల్టీజోన్ -2లో 27 చొప్పున పదోన్నతి కల్పించారన్నారు.

పదోన్నతి ప్రక్రియకు సహకరించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, సీసీఎల్‌ఏ లోకేశ్‌కుమార్‌కు బుధవారం కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు ఈ పదోన్నతుల ప్రక్రియలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డిగారి కృషి ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ఇదే కాకుండా అన్ని స్థాయిలలో పదోన్నతులను కూడా ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలుస్తున్నారన్నారు.