15 March, 2026 | 12:01 AM

ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ

14-03-2026 10:10 PM

డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ప్రభుత్వ ఆశ్రమ (బాలికల) ఉన్నత పాఠశాలను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం పాఠశాలకు చేరుకుని పరీక్షల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ఎలా వ్రాశారో విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు.

ప్రభుత్వం గత వంద రోజులుగా పదో తరగతి విద్యార్థుల ఉత్తమ ఫలితాల కోసం చేపట్టిన లక్ష్యం–2026 కార్యక్రమం వల్ల పరీక్షలు సులభంగా వ్రాయగలిగామని విద్యార్థులు చెప్పడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పరీ క్షల మధ్యలో చదువుకునేం దుకు లభించే విరామాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.

ఇందుకు సబ్జెక్టు ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఖచ్చి తంగా ఉండేలా చూడాలని ప్రధానోపాధ్యాయులు, వార్డెన్‌కు ఆదేశించారు.తనిఖీ అనంతరం డిప్యూటీ డైరెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆమె వెంట ప్రధానోపాధ్యాయులు మాడు గుల నారాయణమూర్తి, వార్డె న్ పెందోర్ మంగవతి, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.