19 May, 2026 | 2:59 PM

ఆలయంలోకి రానివ్వలేదని.. బోనాలతో రోడ్డెక్కిన దళితులు

19-05-2026 01:41 PM

పెద్దపల్లి, మే19 (విజయక్రాంతి): తమను ఆలయంలోకి రానివ్వలేదని దళితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన దళితులు బోనాలతో ఎల్లమ్మ తల్లి ఆలయానికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లారు.

గౌడ సంఘం సభ్యులు కొందరు గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు కుల వివక్షతో తమను అడ్డుకున్నారని, బోనాలతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.