19 May, 2026 | 2:59 PM

వరి ధాన్యానికి నిప్పు పెట్టిన రైతులు

19-05-2026 01:44 PM

కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లినపల్లిలో ధాన్యం కుప్పల వద్ద రైతుల నిరసన

40 రోజులుగా ఎదురుచూస్తున్న కొనుగోలు చేపట్టడం లేదని రైతుల ఆరోపణ

కామారెడ్డి, మే19 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్న పల్లిలో రైతులు సోమవారం రాత్రి వరికుప్పలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మకానికి కొనుగోలు కేంద్రానికి తెచ్చి నలభై రోజులు కావస్తున్న కాంటా పెట్టడం లేదని అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరి కుప్పకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇసన్నపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తేగా కాంటా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసిస్తూ రైతులు వరి కుప్పకు నిప్పు పెట్టి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నలభై రోజులు గడుస్తున్నప్పటికీ ఎండలో నిరీక్షిస్తున్న అధికారులలో చలనం లేకుండా తమ గోడు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ వరి ధాన్యంకు నిప్పు పెట్టారు. ఇకనైనా అధికారులు స్పందించాలని వేడుకున్నారు. వరి ధాన్యం కుప్పకు రైతులు నిప్పు పెట్టారన్న విషయం తెలుసుకున్న జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ సురేందర్, డిపిఎం సాయిలు, సివిల్ సప్లై మేనేజర్ శ్రీకాంత్ సంఘటన స్థలానికి వెళ్లగా రైతులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని  అధికారులను రైతులు నిలదీశారు.కొనుగోలు కేంద్రానికి చేరుకున్న డిఎస్ఓ వెంకటేశ్వర్లు,డిఆర్డిఓ సురేందర్ లు రైతులను సముదాయించారు, లారీలు లేకపోవడం వల్ల ధాన్యం సేకరణ చేపట్టడంలో ఆలస్యం జరిగిందని అధికారులు రైతులకు తెలిపారు. సంయమనం పాటించాలని కోరారు.

హమాలీలు,లారీల కొరత వల్ల సమస్య ఏర్పడిందంటూ అధికారులు పేర్కొన్నారు.హమాలీలు, లారీల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇన్ని రోజులు బడి కాపులు కాస్తుంటే మరోవైపు అకాల వర్షాలు, వడగండ్ల వర్షాలు కురువస్తే నష్టపోయేది తామేనంటూ రైతులు తెలిపారు. అధికారులు నచ్చజెప్పడంతో రైతులు శాంతించి సద్దుమని గారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. రోజుల తరబడి దాన్యం కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్న అధికారులు మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో పాటించడం లేదని దీనితో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని తెలిపారు. దళారి వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవని రైతులంటున్నారు. ప్రభుత్వం రైతులకు మేలు చేస్తున్న మని చెప్తున్న కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించకుండా రైతులకు ఇబ్బందుల కు గురి చేస్తున్నారని రైతుల ఆరోపించారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తేమ శాతం వచ్చిన ధాన్యానికి వెంటనే రైస్ మిల్ కు తరలించాలని రైతులు కోరారు.