19 May, 2026 | 12:04 PM

బుక్క చిట్టీలతో వడ్ల కొనుగోళ్లు… రైతులకు నష్టం?

19-05-2026 10:25 AM

బుక్క చిట్టీలతో వడ్ల కొనుగోళ్లు అంటే అధికారిక రసీదులు లేకుండా ధాన్యం సేకరించడం. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. ఈ విధంగా కొనుగోలు చేస్తే రైతులకు మద్దతు ధర, బోనస్ సక్రమంగా అందకపోవచ్చు.

బిజినేపల్లి, మే 18: యాసంగి సీజన్‌లో రైతులు పండించిన వడ్లను స్థానిక రైస్ మిల్లర్లు అధికారిక పత్రాలు, బిల్లులు లేకుండానే కేవలం “బుక్క చిట్టీల” ఆధారంగా కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మండలంలోని వట్టెం గ్రామానికి చెందిన ఓ రైస్ మిల్లర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రం వద్దే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నాడని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రం, దేశం, ప్రపంచంలోని తాజా వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

గ్రామానికి చెందిన తుల్జా భవాని రైస్ మిల్లు యాజమాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా పెద్ద మొత్తంలో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ శాఖ అధికారులు రైతుల పంట విస్తీర్ణం, పంట వివరాలు, పాస్‌బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా వంటి వివరాలు పరిశీలించి టోకెన్లు జారీ అనంతరం సెంటర్ ఇన్‌చార్జి తేమ, నాణ్యత పరిశీలించి సంచులు అందజేస్తారు.

ఇలాంటి తాజా వ్యవసాయ వార్తల కోసం మా Latest News పేజీని ఫాలో అవ్వండి.

సివిల్ సప్లై అధికారుల నుంచి అలాట్‌మెంట్ లెటర్ వచ్చిన మిల్లర్లకే ధాన్యం తరలించే అనుమతి ఉంటుంది. ధాన్యం తూకం అనంతరం రైతులకు కొనుగోలు పత్రం జారీ చేసి, మద్దతు ధరతో పాటు బోనస్ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

అయితే, వట్టెంలో ఈ నిబంధనలేవీ పాటించకుండా కేవలం బుక్క చిట్టీల ద్వారానే ధాన్యం కొనుగోలు జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారిక రసీదులు లేకుండా కొనుగోళ్లు చేస్తే రైతులకు మద్దతు ధర, బోనస్ సక్రమంగా అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇలాంటి మరిన్ని స్థానిక వార్తల కోసం మా Nagarkurnool News విభాగాన్ని సందర్శించండి.

ఈ వ్యవహారంపై గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

FAQ's

Q1: బుక్క చిట్టీలు అంటే ఏమిటి?

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సమయంలో అధికారిక రసీదుల బదులుగా ఇచ్చే అనధికారిక రికార్డులను బుక్క చిట్టీలు అంటారు.

Q2: ఇవి రైతులకు ఎలా నష్టం?

అధికారిక పత్రాలు లేకపోతే MSP (మద్దతు ధర) మరియు బోనస్ రైతుల ఖాతాలో జమ కావడంలో సమస్యలు వస్తాయి.

Q3: ప్రభుత్వం నిబంధనలు ఏమంటున్నాయి?

టోకెన్, తేమ పరీక్ష, రసీదు, బ్యాంక్ చెల్లింపు వంటి ప్రక్రియలు తప్పనిసరి.

Q4: ఈ ఘటన ఎక్కడ జరిగింది?

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

Q5: అధికారులు స్పందించారా?

ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు.