రైతులకు అంట సాగిపోయే అవగాహన
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ మండలంలోని జాంబుగా గ్రామ రైతువేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పంటల సాగు, నేల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు తక్కువ యూరియా వినియోగించి సాగు ఖర్చులు తగ్గించుకోవాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. అవసరానికి మించిన రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి పరిరక్షణకు సహకరించాలని తెలిపారు.
పంట మార్పిడి విధానాలను పాటించడం ద్వారా సుస్థిర ఆదాయం పొందవచ్చని, మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలనే సాగు చేసి అధిక లాభాలు పొందాలని రైతులకు వివరించారు. అలాగే సాగునీటిని పొదుపుగా వినియోగించి భావితరాలకు సంరక్షించాలని, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ సిహెచ్ భరత్ భూషణ్ రావు, డాక్టర్ డి శిరీష, ఏఓ రామకృష్ణ, ఏఈఓ సృజన, ఆత్మ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ గజ్జి లింగయ్య, ఉప సర్పంచ్ కట్టేకోల పొచమళ్ళు , గ్రామ రైతులు పాల్గొన్నారు.






