22 May, 2026 | 3:41 PM

Breaking News

మార్కెట్లో నిండుకున్న జొన్న మొక్కజొన్న పంట   •   బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరం   •   శ్రీ కృష్ణ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు   •   దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం   •   ఎండిన వాగుకు జీవం పోస్తున్న చెక్ డ్యాములు   •   అడ్మిషన్ లు ప్రారంభం.. విద్యార్థినిలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే   •   భాగ్యరెడ్డి వర్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తి   •   మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు   •   మక్కలు వెంటనే తరలించాలని తహసీల్దార్ కు వినతి   •  

నేటి జల్‌జీవన్‌ మిషన్‌కు.. నాటి సత్యసాయి పథకమే అంకురం

19-11-2025 12:41 PM

సత్యసాయి మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం

పుట్టపర్తి: సత్యసాయి గొప్పదనం గురించి విదేశీయులు చెబుతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో మాట్లాడుతూ, విదేశాల్లో సాయి భక్తులను చాలామందిని చూశానని పేర్కొన్నారు. సత్యసాయి అత్యంత వెనుకబడిన జిల్లాలో వెలిశారని తెలిపారు. సత్యసాయి తన జన్మకు ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారని వివరించారు. సామాన్యుడికి తాగునీరు ఇవ్వాలని సత్యసాయి ఆలోచించారని తెలిపారు. తాగునీటి పథకానికి రూ. 400 కోట్లు సత్యసాయి వెచ్చించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేటి జల్ జీవన్ మిషన్ కు నాటి సత్యసాయి పథకమే అంకురం అన్నారు. సత్యసాయి వేల మంది భక్తులను ప్రభావితం చేస్తారు.. సత్యసాయి మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం అన్నారు. పుట్టపర్తిలో ఘనంగా శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయి కుల్వంత్ హాల్ లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు.