5 August, 2026 | 4:41 AM

బూర్గంపాడు హైస్కూల్‌ను సందర్శించిన డీఈవో

05-08-2026 01:24 AM

బోధన నాణ్యత, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై సమీక్ష

బూర్గంపాడు, ఆగస్టు 4, (విజయక్రాంతి): బూర్గంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) వాసంతి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో జరుగుతున్న బోధనను ప్రత్యక్షంగా పరిశీలించి, విద్యార్థుల నోటు పుస్తకాలను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసి ఉపాధ్యాయులతో మాట్లాడారు.డిజిటల్ తరగతి గదులు, పాఠశాల వసతులు, నిర్వహణ రికార్డులు, మధ్యాహ్న భోజన పథకం అమలును క్షుణ్ణంగా పరిశీలించారు.

విద్యార్థుల హాజరు శాతాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, బోధనఅభ్యసన విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. తద్వారా పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేయాలని కోరారు. అనంతరం విద్యార్థుల క్రీడా కార్యకలాపాలను, స్పోరట్స్ రూమ్ను పరిశీలించిన డీఈవో, ప్రతిరోజూ హెల్త్ ఎడ్యుకేషన్ తరగతులు నిర్వహించాలని పీడీకి సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో యదు సింహరాజు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.