calender_icon.png 20 February, 2026 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్యంపేటలో అక్రమ కట్టడాల కూల్చివేత

20-02-2026 12:00:00 AM

  1. న్యాయవాది కృషితో చర్యలు చేపట్టిన అధికారులు, పోలీసులు  

చివరకు న్యాయమే గెలిచిందన్న గ్రామస్తులు 

కామారెడ్డి, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిపై అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను గురువారం అధికారులు కూల్చి వేశారు. దీంతో గ్రామంలో న్యాయం గెలిచిందన్న భావన వ్యక్తమవుతోంది. ఓ నా యకుడు గ్రామంలో అక్రమ కట్టడాన్ని రాజకీయ పలుకుబడితో కట్టడంతో అధికారులు సైతం వెనుకంజ వేశారు.

అయినప్పటికీ హైకో ర్టు అడ్వకేట్ ముందుకు వచ్చి పోలీసులు అధికారులతో కలిసి అక్రమ కట్టడాన్ని కూల్చివే యించారు. ఈ కట్టడం వెనుక మాజీ ఉప సర్పంచ్ ముత్తగారి శిరీష్ గౌడ్ తన భార్య రోజా పేరుపై రిజిస్టర్ చేసి నిర్మించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తుది ఆదేశాల మేరకు ఈ కూల్చివేతపై చర్యలు చేపట్టారు.

పాఠశాల స్థలం అక్రమణపై గ్రామస్తుల ఆగ్రహం 

ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన సర్వే 638/ ఎ /1, 638 /ఎ/ 2,638/ ఎ ఏ లో రెం డు ఎకరాల 11 గుంటల స్థలాన్ని (సుమారు రెండు కోట్ల వరకు విలువ) గత ప్రభుత్వ కాలంలో ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్ ఆక్రమించి ఆ స్థలాన్ని తన భార్య రోజా పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణా న్ని ప్రారంభించారు. గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించి జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశా రు.

అయిన ఫలితం లేకపోవడంతో గ్రామస్తులంతా కలిసి హైకోర్టును ఆశ్రయించారు.  సుమారు నాలుగు నుంచి ఐదేళ్ల పాటు కేసు విచారణ కొనసాగిన అనంతరం, హై కోర్టు స్పష్టమైన తుది తీర్పు ఇచ్చింది. ఆక్రమిత కట్టడాలను పూర్తిగా కూల్చివేసి, ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పాఠశాలకు అప్పగించాలని ఆదేశించింది.

అధికారులు ఆలస్యం చేయడంతో, హై కోర్టు అడ్వకేట్ సరళ మహేందర్ ముత్యంపేటకు చేరుకొని దోమకొండ ఎస్‌ఐ ప్రభాకర్ భద్రతతో డీఎల్ పీఓ శ్రీనివాస్, ఎంపీడీవో ప్రవీణ్ ఎమ్మార్వో సుధాకర్‌ల సమక్షంలో  అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం ఆ భూమిని అధికారికంగా పాఠశాల యాజమాన్యానికి అప్పగించారు. 

కాగా ఈ అక్రమ నిర్మాణంపై గతంలో వార్తా కవరేజ్ చేసిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం కూడా తీవ్ర వివాదానికి కారణమైంది. నిజాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్టులను భయపెట్టేందుకు కేసులు పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.