జైనూర్‌లో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు సమస్యల పరిష్కారానికి డిమాండ్
జైనూర్, జూన్ 24 (విజయ క్రాంతి) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పలు పాఠశాలల్లో బుధవారం పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.జిల్లా అధ్యక్షుడు ఏటుకూరి శ్రీనివాసరావు పాల్గొని ఉపాధ్యాయులకు సభ్యత్వ నమోదు చేయించి రసీదులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని, బకాయి బిల్లులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 31 నాటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేపట్టాలన్నారు.సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరారు. సమగ్ర శిక్షలోని కేజీబీవీ ఉపాధ్యాయులకు వారాంతపు సెలవును సంవత్సరంలో వినియోగించుకునే అవకాశం కల్పించాలని,హెల్త్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.






