24 July, 2026 | 4:32 AM

రాష్ట్ర బీజేపీ ఎంపీల ఢిల్లీ పర్యటన

24-07-2026 12:00 AM

కేంద్ర జల శక్తి మంత్రితో భేటీ

కాళేశ్వరం, ఇరత సాగునీటి అంశాలపై చర్చ

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం గురువారం కేంద్ర మంత్రి నివాసంలో సమావేశమైంది. తెలంగాణ నీటి పారుదల అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో ప్రధాన నీటి పారుదుల ప్రాజెక్టుల పురోగతి, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాలు ఇతర సాగునీటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం, కేంద్ర సహకారం వంటి విషయాలపైనా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్, గోడెం నగేష్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు పాల్గొన్నారు.