8 March, 2026 | 3:07 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •   గోపాలరావుపల్లెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు   •  

సీఎంతో డెలావేర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ

08-03-2026 12:33 AM
  1. ద్వైపాక్షిక సంబంధాలు, పలు రంగాల్లో పరస్పర సహకారంపై చర్చ
  2. పాల్గొన్న ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో అమెరికాలోని డెలావేర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ శనివారం మర్యాదపూర్వకంగా సమావేశమ య్యారు. ఈ భేటీలో తెలంగాణ, డెలావేర్ రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో కొనసాగాల్సిన ద్వైపాక్షిక సంబంధాలు, పలు రంగాల్లో పరస్పర సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల్లో సీఎంతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డెలావేర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్ పాల్గొన్నారు.

ఈ భేటీలో భాగంగా ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ కేర్ విధానాలపై చర్చించారు. విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునిక బోధనా పద్ధతుల అమలుపై మాట్లాడారు. సాంకేతిక యుగంలో సమాచార భద్రత, డేటా ప్రొటెక్షన్ చట్టాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డెలావేర్ రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల కోసం అమలు చేసిన గృహ నిర్మాణ పథకాలు, రుణమాఫీ వంటి అంశాలను గవర్నర్ సీఎంకు వివరించారు.

తెలంగాణలో జరుగుతున్న అభి వృద్ధిని గవర్నర్ మాట్ మేయర్ అభినందించారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రతినిధుల బృందంతో కలిసి డెలావేర్ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక, సాంకేతిక బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.