15 నుంచి డీఈఈసెట్ దరఖాస్తులు
06-03-2026 02:49 AM
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): డీఈఈసెట్ డిటైల్డ్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎడిట్ చేసుకు నేందుకు ఏప్రిల్ 17, 18 తేదీల్లో, మే 15 నుంచి 21 వరకు హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. డీఈఈసెట్‌ను పరీక్షను 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ఫలితాలను మే 30న విడుదల చేయనున్నారు.




