24 July, 2026 | 7:29 PM

కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

24-07-2026 06:33 PM

ఐసా డిమాండ్

గణపురం,(విజయక్రాంతి): కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐసా డిమాండ్ చేసింది. గణపురం మండల కేంద్రంలో దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఐసా నిర్వహించిన బంద్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా ఐసా జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి మాట్లాడుతూ... విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై కేంద్ర ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహించకుండా విద్యార్థుల ఉద్యమాలను అవమానించడం సరైంది కాదన్నారు. లాఠీచార్జ్ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసా నాయకులు రోహన్, యజ్ఞశ్రీ, ద్రాక్షాయని తదితరులు పాల్గొన్నారు.