24 July, 2026 | 7:33 PM

పిఆర్సిని వెంటనే అమలు చేయాలి

24-07-2026 06:38 PM

రాష్ట్ర పూర్వ అధ్యక్షులు పర్వత్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఎస్టియుటిఎస్ మహబూబ్ నగర్ జిల్లా తృతీయ కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని ఎస్టియు భవన్ నందు జిల్లా అధ్యక్షులు నర్సిములు గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ టి యు టి ఎస్ రాష్ట్రపూర్వ అధ్యక్షులు పర్వత్ రెడ్డి  మాట్లాడుతూ పిఆర్సిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డిఎలను విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దు చేయాలని, ఉద్యోగుల హెల్త్ కార్డుల ద్వారా అన్ని రకాల వ్యాధులకు, అన్ని ఆసుపత్రులలో  మెరుగైన చికిత్స అందేటట్లు చూడాలని, ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలి.

317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని, డి ఎస్ సి  2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, కేజీబీవీలు,  గురుకులాలు, మోడల్ స్కూల్స్, సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎస్ టి యు టి ఎస్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు  పర్వత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు టి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు నర్సిములు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంజనేయులు,  అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపాల్, క్రాంతి కిషోర్,నాగేంద్ర కుమార్, కరుణాకర్,అనంత్ రెడ్డి, వెంకట్రాములు, దాసప్ప, బింగి దొడ్డి వెంకటేష్, పుష్పలత,మంజుల తదితరులు పాల్గొన్నారు.