కేటీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇల్లందులో దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం సేవా కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైక్ ర్యాలీ, ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి మహబూబాబాద్ శివారులోని ఆంజనేయస్వామి దేవాలయం వరకు కేటీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవాలయంలో కేటీఆర్ ఆయురారోగ్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా తెలంగాణ తల్లి చౌరస్తాకు చేరుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.






