24 July, 2026 | 7:34 PM

కేటీఆర్ జన్మదిన వేడుకలు

24-07-2026 06:41 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని రాంప్రతాప్ థియేటర్లో కేకు కట్ చేసి సంబరాలు జరుపుకొని ఒకరినొకరు తినిపించుకున్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన సాయమణి కూతురు శ్రావణి ఎంసిఎ పై చదువుల కొరకు ఎన్ఆర్ఐ లొంకలపల్లి గ్రామానికి చెందిన కిషోర్ రెడ్డి లక్ష రూపాయలు చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది. అనంతరం ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.కేటీఆర్ మరెన్నో జన్మదినాలు జరుపుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. గోపాల్పేట్ గ్రామంలో నూతనంగా వెంకటేశ్వర ఐకేర్ ఆప్టికల్ ప్రారంభోత్సవం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ మాజీ ఏఎంసి చైర్మన్ ప్రతాపరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.