6 March, 2026 | 5:20 PM

పీఆర్సీ తర్వాతే ఈహెచ్‌ఎస్‌కు చందా కట్ చేయాలి

06-03-2026 02:48 AM
  1. 2003 డీఎస్సీ వాళ్లకు పాత పెన్షన్ అమలు చేయాలి

సీఎస్‌కు ఎమ్మెల్సీలు, ఏవీఎన్ రెడ్డి, కొమురయ్య వినతి

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): పీఆర్సీ అమలు చేసిన తర్వాతే ఉపాధ్యాయుల నుంచి ఈహెచ్‌ఎస్ స్కీమ్‌కు 1.5 శాతం చందా కట్ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య కోరారు. ఈమేరకు గురువారం సీఎస్‌ను వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని కోరారు

కేజీబీవీ, యూఆర్ ఎస్, కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా క్యాష్‌లెస్ డిజిటల్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లించాలని కోరారు. సీఎస్‌ను కలిసి న వారిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఒడ్నాల రాజశేఖర్, తెల్కపల్లి పెంటయ్య ఉన్నారు.