24 July, 2026 | 7:40 PM

పోలీసులకు రివార్డులు పంపిణీ చేసిన ఎస్పి

24-07-2026 06:46 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 14న అస్లాం అని యువకుడి హత్య కేసును చేదించిన పోలీసులకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం అభినందించారు. వారం రోజుల్లోనే నిందితులను గుర్తించి పట్టుకుని అరెస్టు చేసిన పోలీస్ సిబ్బందికి నగదు రివార్డులను అందజేశారు. రివార్డులు అందుకున్న వారిలో పోలీస్ సిఐలు కృష్ణ రవీంద్ర నాయక్ ఎస్ఐలు లింబాద్రి శ్రీకాంత్ గోపి గణేష్ అశోక్ సాయి కృష్ణ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.