6 July, 2026 | 4:16 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

డిప్యూటీ ఈవో నోటిఫికేషన్ ఇవ్వాలి

17-02-2026 02:05 AM

డీఎస్‌ఈకు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): డిప్యూటీ ఈవో, డీఎస్సీ, మోడల్ స్కూల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు రావుల రామ్మోహన్ రెడ్డి, దుర్గం హరీష్, శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే 3 సార్లు టెట్  పరీక్షలు పూర్తి చేసినందున రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లు, మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు, డైట్ లెక్చరర్ పోస్టులకు, డిప్యూటి ఈవో పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు బడిబాట, ప్రాథమిక పాఠశాలల బలోపేతంపై మరిన్ని సంస్కరణలు చేయాలని ఉపాద్యాయ విద్యార్థి రేషియోని సవరించాలని తదితర అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు పేర్కొన్నారు.