26 April, 2026 | 6:09 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

తల వెంట్రుకల లోడుతో పారిపోయిన డెకాయిటి గ్యాంగ్ అరెస్ట్

25-02-2026 07:42 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా రాజేంద్రనగర్ కాలనీకి చెందిన అబ్బనవేని చిన్న ఎల్లయ్య జనవరి 10, 2026న 8 క్వింటాళ్ల తల వెంట్రుకలను బొలెరో పికప్ వాహనంలో లోడ్ చేసి జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఉదయం 5:40 గంటల సమయంలో పద్మనగర్ పెట్రోల్ బంక్ సమీపంలో కొందరు వ్యక్తులు ఆర్టీవో అధికారులమని నమ్మించి వాహనాన్ని లోడుతో సహా తీసుకుని పరారయ్యారు.

దొంగిలించిన ఆస్తి విలువ రూ.20 లక్షలు ఉంటుందని బాధితుడు ఫిర్యాదు చేశాడు. తంగళ్ళపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితులు ఖమ్మం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ప్రత్యేక బృందంతో వెళ్లి ఐదుగురిని అరెస్టు చేశారు. వారిలో బొజ్జ కృష్ణయ్య, శివ, అంగులూరి ఎస్ పాల్  బబ్లు, ఎండ్రాతి ఉపేందర్, తీల్ పితియా సన్నీ డాల్ సింగ్, రెవిని క్రాంతి ఉన్నారు.

విచారణలో నేరం ఒప్పుకున్నారు. మరో ఇద్దరు కూడా పాల్గొన్నట్లు తెలిసింది. సిరిసిల్ల రూరల్ సిఐ కె. మొగలి విచారణ అనంతరం నిందితులను సిరిసిల్ల కోర్టులో హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించి కరీంనగర్ జైలుకు తరలించింది. కేసును ఛేదించిన ఎస్ఐ ఉపేంద్ర చారి మరియు కానిస్టేబుళ్లు సంపత్, శ్రావణ్, శ్రీనివాస్‌ను అధికారులు అభినందించారు.