ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ
క్షురకుని దూషించిన ఖకిపై అట్టుడికిన నాయిలు
కొత్తగూడెం సెలూన్ యజమానులు నల్ల బ్యాడ్జిల తో నిరసన
కొత్తగూడెం,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలో గల నాయి బ్రాహ్మణులపై ఓ అహంకారైన 3టౌన్ ఎస్సై (చందర్ ) నాయి సోదరునిపై, దుర్భాషలాడి నాయి బ్రాహ్మణ వ్యవస్థను కించపరచాలా మాట్లాడిన ఖకిపై వెంటనే, చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘం కన్వీనర్ (వంశీ ,)జనగామ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన వెళ్లువను వ్యక్తపరిచారు. తెలంగాణలో ప్రతి ఒక్కరిని అన్న అని సంబోధించడం ,మామూలు విషయమేనని అందులో భాగంగా ఒక ఎస్ఐ చందర్ తన అవసర నిమిత్తం సెలూన్ షాప్కి వెళ్లితే అక్కడ పనిచేసే నాయి సోదరుడు కష్టమర్ ల అతడు అన్నా అని సంబోధించినందుకు, అతన్ని పరుజాళంతో దూషించి, చెయ్ చేసుకోవడంతో సభ్య సమాజం సిగ్గుపడేలా అతని ప్రవర్తనను చూసి సమాజం,సోషల్ మీడియా పలు కామెంట్లతో దుమ్మెత్తి పోసింది.
నాయి బ్రాహ్మణ కుల వ్యవస్థను కించపరిచేలా అతని మాటలు ఉన్నందున, ఉమ్మడి రాష్ట్ర నాయి సోదరులు మానసిక ఆందోళనకు గురయ్యారు. అందుకు బదులుగా ఉమ్మడి రాష్ట్రంలోనే నాయి సోదరులు, ఆదివారం రోజున కొత్తగూడెం పట్టణంలోని అన్ని సెలూన్ షాపుల్లో నిరసన వ్యక్తపరిచారు. జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క నిరసనలు అట్టుడికి, అహంకారి అయిన ఆ ఖకిపై చర్యలు తక్షణమే తీసుకొని భవిష్యత్తులో, నాయి బ్రాహ్మణులపై చేయిచేసుకోడం, వారిపై దూషించడం కానీ చేస్తే అట్రాసిటీ లాంటి చట్టాలను తీసుకురావాలని ,కొత్తగూడెం కన్వీనర్ జనగామ సత్యనారాయణ ఈఈ సందర్భంగా తెలియజేస్తూ, సంఘటనను ఖండించారూ..
ఈ సంఘటన ఉమ్మడి రాష్ట్రాలను ఒక్కసారి ఉలిక్కిపడేలా, మనస్థాపానికి గురిచేసాయి. ఎంతటి అధికారి అయినా ఎంతటి ఉన్నత చదువులు చదివిన, సాటివారిని గౌరవించుకోలేని, విద్య, వృధా ఏ అని, రక్షకబటులు ప్రజలకు రక్షణ కల్పించాలే తప్ప ప్రజలను భక్షించేలా, ఉండకూడదని ప్రజతో సాన్నిహితంగా ప్రజా దోస్త్ పోలీసుగా, నడవాలని చట్టాలు చెబుతున్న వాటి పట్ల నిర్లక్ష్య ధోరణి గా వ్యవహరించి ,ఒక సామాన్య నాయి బ్రాహ్మణుని పై తన ప్రతాపం చూపడం సరైనది కాదని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు నాయి సోదరులు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసనలు , ఒక ఉద్యమంలా ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తగూడెం కన్వీనర్ సత్యనారాయణ, కురుమళ్ళ శంకర్, సిద్దు,ఈ కార్యక్రమంలో పలువురు నాయి సోదరులు పాల్గొని నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తపరిచారు.






