calender_icon.png 17 February, 2026 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురికి మరణశిక్ష

17-02-2026 12:17:54 AM

విదేశీయురాలితోపాటు మరో మహిళపై గ్యాంగ్‌రేప్

గతేడాది హంపిలో ఘటన

కొప్పళ కోర్టు సంచలన తీర్పు

బెంగళూరు, ఫిబ్రవరి 16: విదేశీ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారంతోపాటు మరో హత్యకు కారణమైన ముగ్గురు నిందితులకు సోమవారం కర్ణాటకలోని కొప్పళ జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతేడాది మార్చి ౬న ఇజ్రాయెల్‌కు చెందిన ఓ పర్యాటకురాలు తన బృంద సభ్యులతో కలిసి హంపి క్షేత్రాన్ని సందర్శించేందుకు వచ్చారు.

పర్యటనలో భాగంగా వారు ఓ వాహనంలో హంపికి వస్తుండగా, సానాపుర తుంగభద్ర ఎడమ కాల్వ వద్ద మల్లేష్ అలియాస్ హండిమల్ల, సాయి, శరణప్ప వద్ద అడ్డుకున్నారు. వాహనంలోకి వెళ్లి ముగ్గుర నిందితులు తమ కు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్యాటకులు అందుకు నిరాకరించారు. అం దుకు కోపోద్రిక్తులైన నిందితులు ముగ్గురు పురుష పర్యాటకులను బలవంతంగా కాలువలోకి నెట్టేశారు. కాలువలో పడిన ముగ్గురిలో ఇద్దరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణా లు కాపాడుకున్నారు.

మరో వ్యక్తి మాత్రం నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం వాహనంలో ఉన్న ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల్లో ఒకరు భారతీయురాలు కాగా, మరో మహిళ ఇజ్రాయెల్‌కు చెందిన పర్యాటకురాలు. బాధితుల ఫిర్యాదు మేరకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి, కొప్పళ సెషన్స్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీనిపై కోర్టు పూర్తి స్థాయి వాదనలు విన్నది. నిందితులపై నేరం రుజువు కావడంతో పాటు కేసును కోర్టు ‘అత్యంత అరుదైన కేసు’గా పరిగణించి నిందితులు మల్లేష్ అలియాస్ హండిమల్ల, సాయి, శరణప్పకు ఉరిశిక్ష విధించింది.