పలు శుభకార్యాలు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్
నిజాంసాగర్, మే 8(విజయ క్రాంతి) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని పలు శుభకార్యాలు,పెళ్లిళ్లు, ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలలో శుక్రవారం నాడు కామారెడ్డి డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ పాల్గొన్నారు. మండలంలోని అచ్చంపేట్, జక్కాపూర్ గ్రామాలలో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎన్నో కుటుంబాల స్వప్నాలు సాకారం అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు గౌరవప్రదమైన నివాస వసతి కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి,మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్. రవీందర్ రెడ్డి, నిజాంసాగర్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య,మహమ్మద్ నగర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గంగి రమేష్,తదితరులు పాల్గొన్నారు.






