ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పిన డానోన్ ఇండియా
భారతదేశం, మార్చి 2026: ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతను ఎదుర్కోవడానికి భారతదేశవ్యాప్తంగా 20,911 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రతిజ్ఞ చేయడంతో, డానోన్ ఇండియా 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఐరన్ లోపం, రక్తహీనతను పరిష్కరించడానికి అవగాహనను పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పోషకాహార చర్యలను ప్రోత్సహించడంలో డానోన్ చేసిన సామూహిక కృషికి ఈ చారిత్రాత్మక విజయం నిదర్శనంగా నిలిచింది. సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కోవడంలో, ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో డానోన్ ఇండియా తమ వంతుగా ప్రయత్నిస్తోంది.
నవంబర్ 2025లో, డనోన్ ఇండియా దేశవ్యాప్తంగా ఐరన్ లోప రక్తహీనతను గుర్తించడం, నివారించడాన్ని వేగవంతం చేయడానికి 'ఐరన్ అప్!' అనే జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, అవగాహన పెంచడానికి, సకాలంలో రోగ నిర్ధారణను మెరుగుపరచడానికి, నివారణ పోషణను ప్రోత్సహించడాని కి కట్టుబడి ఉండాలని ఆరోగ్య సంరక్షణ నిపుణులకు పిలుపునిస్తూ డానోన్ ఇండియా ప్లెడ్జ్ క్యాంపెయిన్'ను ప్రారంభించింది.
'ఐరన్ అప్' చొరవ అనే ప్రచారం, అవగాహన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాల ద్వారా భారతదేశవ్యాప్తంగా ఉన్న శిశువైద్యులు, సాధారణ వైద్యులు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులను భాగస్వాములను చేసింది. వైద్య సమాజాన్ని సమీకరించడం ద్వారా, డానోన్ ఇండియా ముఖ్యంగా పేద ప్రజలలో ఐరన్ లోపంపై అవగాహన పెంచడానికి, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రభావవంతమైన కార్యక్రమానికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందడం తమకు గర్వకారణంగా ఉందని డానోన్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ ప్రియాంక వర్మ చెప్పారు.ఆరోగ్యకరమైన భవి ష్యత్తును నిర్మించడానికి తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు.




