30 July, 2026 | 3:07 PM

ఉచిత కంటి ఆపరేషన్ల కోసం జిల్లెల్ల నుంచి 15 మంది రోగుల తరలింపు

30-07-2026 02:20 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో కోడి అంతయ్య, ఎన్ఫై టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎంపికైన 15 మంది రోగులను ఉచిత కంటి ఆపరేషన్ల కోసం కరీంనగర్‌లోని లయన్స్ క్లబ్ రేకుర్తి ఆస్పత్రికి ప్రత్యేక బస్సులో పంపించారు. అక్కడ వారికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు, అవసరమైన వైద్య సేవలు అందించనున్నారు.

ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఫై టెక్నాలజీ ఫౌండర్ అంకారపు రవి, శ్రీ వెంకటేశ్వర కంటి ఆస్పత్రి వైద్యుడు భానుచందర్, లయన్స్ క్లబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుగ్గిళ్ల జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.