మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్‌కు దళిత రత్న అవార్డు అందజేత
గరిడేపల్లి, ఏప్రిల్ 19: హైదరాబాద్ రవీంద్రభారతిలో డాక్టర్ జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో మాదిగలకు చేసిన సేవను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత నాయకులకు దళితుల కోసం విశిష్ట సేవలు అందించిన వారికి దళిత రత్న అవార్డు ప్రధానం చేశారు. దీనిలో భాగంగా మండలంలోని కాచవారిగూడెం గ్రామానికి చెందిన రాష్ట్ర ఎమ్మార్పీఎస్ కార్యదర్శి మిద్దె. వెంకటేశ్వర్లు మాదిగ(మాజీ సర్పంచ్) ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య నాయ కత్వంలో ఉద్యమంలో పాల్గొన్నారు.
తాను చేసిన సేవలను గుర్తించి దళిత రత్న అవార్డు ప్రధానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మిద్దె.వెంకటేశ్వర్లు మాదిగ మాట్లాడుతూ దళిత రత్న అవార్డు రావడానికి సహకరించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ,ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గంట సుదర్శన్ ,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్మిక అధ్యక్షులు చింతబాబు మాదిగ గారు,జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగ ,నేరేడుచర్ల మాజీ జడ్పీటీసీ రాపోలు నర్సయ్య,హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ రావూరి.విజయ భాస్కర్ మాదిగ ,రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు పిడమర్తి.నారాయణ,జిల్లా ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి కస్తాల సైదులు మాదిగ ,టౌన్ అధ్యక్షులు రెడపంగు.రాము, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కస్తాల.రవిమాదిగ, రాష్ట్ర, జిల్లా నాయకులు మండల అధ్యక్షులు కార్యకర్తలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.






