2 April, 2026 | 3:28 PM

Breaking News

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •  

విద్యుత్తు షాక్‌తో పాడి ఆవు మృతి

06-10-2025 12:00 AM

మహమ్మదాబాద్ అక్టోబర్ 5: పాడి పశువులను పెంచుకుంటూ ఉపాధి పొందుదా మని ఆశించిన ఓ రైతుకు విద్యుత్ షాక్ అత ని కుటుంబంలో విషాదం మిగిల్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని జూలపల్లి గ్రామానికి చెందిన అల్లాడి బాలయ్య(బాల్ రెడ్డి) కి చెందిన ఆవు శనివారం సాయంత్రం మేతకు విడిచారు.

తన పొలం లో ఉన్న విద్యుత్ బుడ్డి కి తగిలి అక్కడికక్కడే ఆవు ప్రాణాలను కోల్పోయింది. ఈ అవును 15 రోజుల క్రితమే రూ 1లక్ష 6 వేలకు కొనుగోలు చేశారు. అప్పుసప్పుచేసి ఆవును తీసు కొచ్చి బతుకుదామనుకొని ఆశించిన ఆ రైతుకు విద్యుత్ షాక్ తో ఆవు మరణించడం తో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని గ్రామస్తులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. తమన ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.