17 July, 2026 | 8:34 PM

Breaking News

నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •  

జాతరలో పోటెత్తిన భక్తజనం

31-01-2026 01:54 AM

మంచిర్యాల టౌన్ / లక్షెట్టిపేట టౌన్, (విజయక్రాంతి): సమ్మక్క - సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శుక్రవారం తరలివచ్చారు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి శివారులో వెలిసిన సమ్మక్క - సారలమ్మ గద్దెల వద్దకు, అటు  లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల శివారులోని గోదావరి తీరాన వెలసిన సమ్మక్క - సారక్కలను, మందమర్రి మండలంలోని ఆర్కే 5 గని వద్ద వెలిసిన అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున గద్దెల వద్దకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారం పంచిపెట్టారు. కోళ్లు, మేకలతో మొక్కులు పెట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతర కమిటీ త్రాగునీటి సదుపాయం, నీడ కోసం టెంట్లు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయగా, పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించారు.