అకాల వర్షానికి 1034 ఎకరాలలో పంట నష్టం
25-02-2026 01:27 AM
- నేలకొరిగిన పొద్దుతిరుగుడు, మొక్కజొన్న
- రాయపోల్, కొండపాక మండలాల్లో అంచనా వేసిన అధికారులు
గజ్వేల్/ కొండపాక,ఫిబ్రవరి24: గజ్వేల్ వ్యవసాయ డివిజన్ లోని రాయపోల్, కొండపాక మండలాల్లో సోమవారం కురిసిన ఆకాల వర్షానికి 1034 ఎకరాల్లో పొద్దు తిరుగుడు మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని గజ్వేల్ ఏ డి ఏ బాబు నాయక్ తెలిపారు. రాయపోల్ మండల ఏవో నరేష్, కొండపాక మండల ఏవో శివరామకృష్ణలు అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో 362 ఎకరాలలో పొద్దుతిరుగుడు పంట పూర్తిగా నిలవాలి వంట నష్టం వాటిల్లగా, రాయపోల్ కొండపాక మండలాల్లో కలిపి 692 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం వాటిలినట్లు అధికారులు తెలిపారు.




