7 May, 2026 | 12:37 AM

రైతులకు సకాలంలో పంట రుణాలను ఇవ్వాలి

07-05-2026 12:10 AM

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గీత  

ఆమనగల్లు,మే06(విజయక్రాంతి);  రైతులకు సకాలంలో పంట రుణాలు అందజేయాలని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గీత పేర్కొన్నారు. బుధవారం ఆమనగల్లు పట్టణంలోని రైతు వేదికలో  ఆమనగల్లు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా పాలన _ప్రగతి ప్రణాళిక లో  భాగంగా 99 రోజుల ప్రణాళిక అమలు కోసం రైతు వారోత్సవాలు నిర్వహించారు.

ఏఎంసీ చైర్ పర్సన్  యాట గీత మాట్లాడుతూ.. రైతులకు వివిధ బ్యాంకుల నుండి రుణాలు మంజూరు చేయాలని, బ్యాంకు అధికారుల తీరు మార్చుకొని, రైతులను ఆదుకోవాలని,సులభ మార్గం ద్వారా రైతులకు వెంటనే మార్టిగేజ్ లోన్లు,ట్రాక్టర్స్, హా ర్వెస్టర్స్,అగ్రికల్చర్ లోన్లు ఇచ్చి పాడి పరిశ్రమ రైతులకు అండగా ఉండాలని బ్యాంకు అధికారులకు సూచించారు.

ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, మాడ్గుల, మండలాల పీఎసీఎస్ సెక్రటరీలు, అన్ని మండలాల ఎస్‌బీఐ  బ్యాంక్, టీజీవీబీ బ్యాంక్, డీసీసీ బ్యాంకు,యూనియన్ బ్యాంక్, టీఎస్ పీఎస్ సీ ఎస్ బ్యాంక్ అన్ని బ్యాంకుల మేనేజర్లు, అన్ని మండలాల వ్యవసాయ  ఏవోలు, ఏఈఓ లు, ఫీల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, ఏడీఏ శోభారాణి, కోఆప్షన్స్ సభ్యులు ఖాదర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.