7 May, 2026 | 12:37 AM

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

07-05-2026 12:11 AM

అశ్వాపురం, మే 6, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం ఓరుగంటి వీరయ్య భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించి శాలువాలు కప్పి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయన చేత కేక్ కట్ చేయించి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టగా కేరింతల మధ్య పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో కొనసాగాయి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్ష్మయ్య, గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, ఊసా అనిల్ కుమార్, బూరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచ్లు ఏనిక ఉషారాణి, మచ్చా నరసింహరావు, సబ్కా పిచ్చయ్య, కుంజా జాను, ఎట్టి నరేష్, ఇర్పా రాజు పాల్గొన్నారు.